పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

సింహాసన ద్వాత్రింశిక


వ.

మఱియుఁ గొన్ని దినంబులు సనిన నేకాదశద్వారవీక్షకుండై.

41


పదునొకొండవబొమ్మ కథ

క.

సూక్ష్మముగఁ దలఁచెద న్మృగ
లక్ష్మకళారమ్యు వీరలక్ష్మీగమ్యున్
లక్ష్మిలలనావక్షో
జక్ష్మాధరసక్తు భక్తసంహు నృసింహున్.

42


క.

అని నియమంబున భోజుం
డనువగులగ్నమునఁ జేర నరిగి మహేంద్రా
సన మెక్కఁబోఁగ నిలునిలు
మని యచ్చటిబొమ్మ పలికె నచ్చెరు వందన్.

43


క.

పరికింప విక్రమార్కుని
సరిపూనఁ బరోపకారసత్త్వంబులు సు
స్థిరముగఁ గలగనివానికిఁ
దరమే యిట దీని నేక్క ధారాధీశా.

44


క.

అనవుడు నవ్వసుధాపతి
చనునతనిపరోపకారసత్త్వగుణము లె
ట్లనఁ బాంచాలికయును స
ద్వినయంబున భోజనృపతి విన ని ట్లనియెన్.[1]

45


క.

జననాథ రాజసముఖం
బున నున్ననరుండు యోగ్యము నయోగ్యముఁ[2]

  1. వ. అనవుడు నవ్వసుమతీపతి యతని పరోపకార సత్త్వగుణంబు లెట్టివనినఁ బాంచాలిక సవినయంబుగా ని ట్లనియె. అని యొక ప్రతిలో వచనమున్నది.
  2. రాజసమ్ముఖ
    మున నరుఁ డవయోగకార్యములుగా వెసఁ