పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

సింహాసన ద్వాత్రింశిక


క.

అని బహువిధములఁ జెప్పఁగ
విని జనపతి తెలిసి యోగవిద్యావిభవం
బున రాజయోగి యనఁగా
జనకునిక్రియఁ బ్రజలఁ బెంచె జనకునిభంగిన్.

17


వ.

ఇట్లు కొంతకాలంబు పుచ్చి తన్ముఖకళలం జూచి యోతాపసోత్తమ నీకెన్నియేం డ్లయ్యె నని యడిగిన నతండు యోగికిఁ గాలక్రమంబు విచారింపనేల నూఱేండ్లు వేయేండ్లని యెన్నిక గలదే సిద్ధయోగంబున వజ్రశరీరంబు దుర్లభంబు గాదు.

19


క.

బాధాబిరహితగతికుఁడు
బోధాహితపరమహర్షపూర్ణుఁడు నిజవాం
ఛాధీనమరణుఁ డీక్షణ
సాధితచిన్మూర్తి యోగి సామాన్యుండే.

20


క.

తలనరసినఁ జెక్కులపై
వళు లెగసిన మేని బిగువు వదలిన నేత్రం
బుల నెఱ్ఱసెరలు విరిసిన
జెలువెడలిన యతఁడు[1] యోగసిద్ధుఁడె ధాత్రిన్.

21


క.

అనఁ దద్వచనామృతసే
చనమున యోగంబు సిద్ధిచందము దెలియన్
మనమునఁ గౌతుకకందళి
మొనసూపిన నృపుని నెఱిఁగి మునినాయకుఁడున్.

22


ఆ.

ఎద్దియైన నీకు నెఱిఁగింతు నడుగుము
సిగ్గుపడకు మనుడు క్షితివరుండు

  1. జెలువించుక యెడయ