పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 201

క. దుర్బలుఁడ వోరి నీదగు
దోర్బల మిది యెంత నన్ను దొరసెదు విను నేఁ
గర్బురుఁడఁ దొల్లి నాచే
నర్బుదసంఖ్యలుగ మనుజు లణఁగిరిచుమ్మీ. 274

శా. వారిం గూడఁగ నేఁగుమంచు గద వైవంజేరినన్ భీముఁడా
కౌరవ్యేంద్రుని నేలఁ గూల్చుగతి నాక్ష్మానాయకుండుం దదీ
యోరుద్వంద్వము నొంచి కూల్చి భువి దైత్యున్ ఖండతుండంబుగా
ఘోరాస్త్రాహతిఁ బ్రోవుచేసె, సుర లుత్క్రోశించి[1] వర్ణింపఁగన్. 275

క. రక్కసుఁడనియెడు చీకఁటి
నుక్కడఁపి శుభోదయమున నొప్పుచుఁ దమకున్
దిక్కైన విక్రమార్కుని
నక్కమలాకరుఁడు చూచి హర్షం బందన్. 276

క. తత్సాహసబలధైర్యస
ముత్సేకంబులకుఁ జోద్య మొందుచుఁ బ్రియసం
విత్సమ్మతి నరమోహిని
యుత్సుకయై మ్రొక్కి పలికె నోభూనాథా. 277

క. నామంబున నరమోహిని
నామెఱయఁగ వీనిచేత నరఘాతినినా
నామీఁద నున్నకీ డిదె
నీమాహాత్మ్యమునఁ బాసె నిమిషములోనన్. 278

క. కావున నా కేవిధమునఁ
గావం బ్రోవంగ నీవ కర్తవు పను లౌఁ

  1. సురలుత్కోచించి