పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200 సింహాసన ద్వాత్రింశిక

వట్టినగవులఁ జప్పట్లు వెట్టికొనుచు
నాడఁజొచ్చిరి చేడెలు పాడిపాడి. 268

వ. ఇట్టివినోదంబులు సూచుచు విక్రమాదిత్యుండు త్రివిక్రమాపత్యంబు తోడరా నరమోహిని గేహంబున కేఁగి తదాళీపరిచరితసముచితోపచారంబులు గైకొని హంసతూలికాపర్యంకంబుపై సుఖాసీనుండై సరసవాక్యంబులం బ్రొద్దుపుచ్చి. 269

క. నరమోహిని మీరక్కసుఁ
డరుదెంచి తలంగకుండ నాలోపల ని
న్నరయుచు నుండెద నని భూ
సురయుతుఁడై యధిపుఁ డఱ్ఱసొచ్చెన్ బుద్ధిన్. 270

క. ఆలోన నొదిఁగి యున్నెడ
నీలాలక శయ్యమీఁద నిద్రింపఁగ నా
భీలనయనాంతదంత
జ్వాలలు నిగుడంగ నసుర వచ్చెం బెలుచన్. 271

ఉ. అచ్చట నొంటినున్న సతి నార్చుచు వేసి యదల్చి నీవిటుం
డెచ్చట డాఁగెఁ జూపు మని యీడ్చి గృహాంగణసీమ కేఁగఁగాఁ
జెచ్చెర విక్రమార్కుఁ డొకసింహము చాడ్పున నేన వీఁడుగో[1]
వచ్చితినంచు నార్పుఁగొని[2] వచ్చెఁ గరాళకృపాణపాణియై. 272

క. అటు వచ్చిన దనుజుఁడు గిట
కిటఁ బండులు గీఁటుకొనుచుఁ గినుకవొడమి యు
ద్భటవృత్తి నెగసినం గని
భటధర్మము దప్పి తోడి పాఱితి వనుచున్. 278

  1. వీఁడకో
  2. నార్చుకొని