పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 199

వ. మఱియొక్కర్తు. 264

క. ఎక్కడ శుక్రునిశాపం
బిక్కడఁ గొందఱకు భాగ్య మించుక యైనన్
లెక్కకు నెక్కనికతమున
డక్కెఁజు మీ మధువు లేర్పడ న్మనకెల్లన్[1]. 265

వ. అని తమనేర్పులం గొనియాడుచు నానందంబున మాటలు తొట్రువడఁ బలుకుచుం బయ్యెదలు సవరించుటలు మఱచి లజ్జలు దొలంగ బహుప్రకారంబుల నున్మత్తభావంబులు దోఁపంబ్రవర్తిల్లి. 266

ఉ. ఇంవు మనంబులోన నటియింపఁగఁ జెక్కులమీఁదఁ గన్నులం
గెంపువహింప మోవిఁగల కెంపు చలింపఁగ ఘర్మబిందువుల్
పొంపిరివోవ ముద్దుమొగముల్ మెఱుపెక్క రతాంతసంగతిన్
సొంపువహించి రంగనలు సోలుచు నమ్మదిరామదంబునన్. 267

సీ. అక్క మీతల్లి మాయత్త[2] యౌ నెఱిఁగితిఁ
గోడలితల్లి నాకూఁతు రగుట
మాతల్లిమఱఁది మామామ సభ్యులక్రియ
నుయ్యిఁ[3] జంకిటనిడి యొయ్యనరిగె
మాబావకొడుకు నామఱఁది గాలపువేఁటఁ
గొమ్ములకుందేలుఁ గొట్టితెచ్చె
నిది సెప్పఁ గొఱఁతని యిది కల్లసేయక
చెవులారఁ జూడు నేఁ జెప్పినట్టు
తే. లనుచు లోకవిరోధోక్తు లాడుకొనుచు
సొలపులూరఁగ నోరచూపులు నటింప

  1. దక్కెంబో మధువు నేఁడు దగమనకెల్లన్
  2. మాయక్క
  3. నొయ్య-నయ్య