పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 193

వ. ఇట్లు కతిపయదివసంబుల కాపురి సొచ్చి గూడవేషంబునం దిరుగుచు రాజమార్గంబున నున్న నరమోహినిం జూచి తదీయలావణ్యపయోధిలో మునిఁగిన దృష్టిం దివియంజాలక తనుఁ దాన సవరించుకొని. 231

క. సురకిన్నరపన్నగఖే
చరకన్మలఁ జూచినాఁడ సరిపోల్పఁగ నే
తరుణులు లే రీతరుణికి
నరమోహిని యనఁగ నున్ననామంబ తగున్. 232

క. చూపులు మర్మము గాఁడెడు
తూపులు మురిపముల వలపుఁదూపులసరికిం[1]
బ్రాపులు సతినిలు వంతయుఁ
దీపులు నగు మన్మథాస్త్రదేవతచుమ్మీ. 233

క. ఈపొలఁతి రాక్షసాశ్రిత
యై పన్నగసహితచందనాకృతి మెఱయున్
దీపితయై వెఱపించెడి
వ్యాపారముకొలఁదిఁ జూడవలయును మనకున్. 234

క. కావున నీ వింటికిఁ జని
నే వచ్చెద ననుచుఁ జెప్పు నెలఁతుకతోడన్
నావుడుఁ గమలాకరుఁడును
నా వెలఁదికిఁ జెప్పి వచ్చి నరపతి కనియెన్. 235

తే. దేవ యీ మాటఁజెప్పినఁ దెఱవనవ్వి
యొయ్యఁబలుకుచు నిదురకు నియ్యకొనుచుఁ
గర్భురుం డనునొక్కరక్కసుఁడు గలఁడు
వాని మఱవక రమ్మని చెప్పె[2] వనిత.

  1. మరుకున్
  2. నొక్కచిక్కునుగలడొక్కరక్షసుండుఁ చేరిచనుదెంచు నీవింతఁ జేరుమనియె