పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiv

ఇమాం కథాం కథయిత్వా సాలభంజికా భోజరాజం అబ్రవీత్. భో రాజన్! ఏవం విధం సాహసం త్వయి విద్యతేచేత్ అస్మిన్ సింహాసనే ఉపవిశ, తత్ శ్రుత్వా రాజా తూష్ణీం బభూవ

ఇతి పంచవింశోపాఖ్యానమ్

ఇరువది యైదవ బొమ్మకథ :

కం॥ శ్రీ దయితా వదనచ్ఛా
     యాదర్శీభూత కౌస్తుభారుణతేజో
     మేదుర వక్షఃస్థలు దా
     మోదరుఁ గాకోదరేంద్ర యోజిత తల్పున్॥

క. నెమ్మనమునఁ దలఁపుచు మో
   హమ్మున సింహాసనమున కరుదెంచినఁ జో
   ద్యమ్ముగ నిరువది యేనవ
   బొమ్మవలికె నడ్డపెట్టి భోజనృపాలున్.

క. ఏమని చెప్పుదు నుజ్జయి
   నీమనుజాధిపుని భంగి నియతంబుగ నో
   భూమీశ్వర దివ్యంబగు
   సామర్థ్యము లేక యెక్కఁజన దెవ్వరికిన్.

మ. అది యెట్లన్న నెఱుంగఁ జెప్పెద నరివ్యాపాద నాసాదనో
    న్మదబాహాయుగళుం డనంత ధనదాన ప్రీణితక్ష్మాతల
    త్రిదశస్తోమ నిరంతరస్తుతి లసత్కీర్తిప్రియుం డంగనా
    మదనాకారుఁ డవంతినాయకుఁడు సామ్రాజ్యంబుతో నొప్పుచున్

శా. ప్రాతఃకాలమునందుఁ గొల్వున నయప్రఖ్యాతులౌ రాజులున్
    నీతిన్యస్తమనస్కులౌ సచివులున్ విద్వాంసులుం గొల్వఁగా