పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 205

ఇంక వృద్ధివళ్ళు—
క. సుగుణైధిత నగరౌషధి
నగౌఘనైకాది యోజనలసంధులఁ బెం
పుగ వృద్ధు లండ్రు వానికి
నగు నయహలు వళ్ళు నరవరౌఘశరణ్యా. 205

ఇంకఁ బ్లుతవళ్ళు—
క. గానప్రశ్నవిధానా
హ్వానములఁ ద్రిమాత్రమైన యత్వము నుభయా
ధీనమునై వళ్ళకుఁ జన
నౌ[1] నిది నీవేమి యెఱుఁగవా సర్వజ్ఞా. 206

ఇంక నిత్యసమాసవళ్ళు—
క. డాయఁగ సమసింపఁగఁ బా
రాయణ నారాయణాంతరంగానేకా
నాయాసాదులఁ గర్ణర
సాయనముగ రెండువళ్ళు జరుగుచునుండున్. 207

క. ఇది చేతిది పోచక పి
న్నది కట్టెఁడు దానికంటె నల్లల ననునీ
పదముల నుభయముగొన ను
న్నదివళ్ళకు ననుమతంబు నరలోకేంద్రా. 208

ఇంకఁ బ్రాదివళ్ళు—
క. మేదినఁ బ్రపరిప్రతినిప
రాదురుపాపాత్యవవినిరాఙన్వభిసం

  1. జనఁగా