పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186 సింహాసన ద్వాత్రింశిక

ధరజ్ఞణలు మొదలవిన మం
తరపదములఁ గలుగునేని దగునట్టులగున్. 200

ఇంక సంయుక్తవళ్ళు—
క. బుధసమ్మతి మిశ్రితబహు
విధవర్ణములందు వళ్ళు వివరింపంగా
నగరీకృతఫల్గునశా
ర్ఙధరనిభా యెల్లయక్షరమ్ములుఁ జెల్లున్. 201

ఇంక ననుస్వారవళ్ళు -
క. అమరంగ వర్గస్థితవ
ర్ణములపిఱుంద బిందులూఁదినం బంచమవ
ర్ణములును వళ్ళగు జయసం
భ్రమపరిచితపరనృపాల మానితకీర్తీ. 202

ఇంకఁ బోలికవళ్ళు—
క. పోలును[1] బుపుబుభులకు మూ
పోలికవడి యనఁగ నంత్యమున యతి మీఁదం
దేలి బుకారముపట్లను
భూకోకసురేంద్ర యోగ్యముగఁ జనుదెంచున్. 203

క. తెలుగుననదికెడి శబ్దం
బులమీఁదిమకార మందముగ స్వత్త్వమునన్
నిలుచు నట పావడికినై
పలుకుటకంటెను భజించుఁ బావడియైనన్. 204

  1. పోలఁగ