పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 185

ఇంక వ్యంజనస్వరవళ్ళు—
క. ఈకొలదిఁ గాక కాదులు
గైకొని చెప్పుదురు వళ్ళకడ నీస్వరముల్
పైకొనఁగఁ దత్స్వరంబులు
నాకడ వళ్ళౌ నృపాలకాన్వయతిలకా. 196

ఇంక గూఢస్వరవ్యంజనవళ్ళు—
క. ఆన్యోన్యపరీక్షాదిప
దన్యాసములందు సంస్కృతస్వరములు[1] పూ
ర్వన్యాయంబుగ నగు న
న్యోన్యము వడి హల్లు సెల్లు నూతనకర్ణా. 197

ఇంక వర్గవళ్ళు—
క. రమణీజన్మమన్మథ భూ
రమణా నిజపంచమాక్షరము వర్జ్యముగాఁ
దమనాలుగక్షరమ్ములు
దమలోఁ వళ్ళయ్యెఁ గచటతపవర్గములన్. 198

ఇంక సరసవళ్ళు—
క. వయముగ చఛజఝుశషసలు
నియహలు నణలును జెలంగు[2] యతి మీఁద నసం
శయగతిఁ దమలో వీడ్వడు
జయలక్ష్మీయువతిభోగసౌభాగ్యనిధీ[3]. 199

ఇంక నెక్కటివళ్ళు—
క. నరవరవంశవిభూషణ
మరవఱలను వళ్ళొగిం దమకుఁ దామె యగున్

  1. సంభృతస్వరములు
  2. బెనంగి
  3. సౌందర్యనిధీ