పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 183

పితుఁడై శాస్త్రపురాణకావ్యనిగమస్మృతర్థసంగీతసం
గతి మర్మజ్ఞతతోఁ బ్రసంగ మెలమిం గావింపఁగా నిట్లనున్. 134

క. యత్నమునఁ దెలియు నన్ని యు
రత్నాకరుభాతి దుస్తరం బగు విద్వా
రత్నము గవితాతత్త్వము
నూత్నముగా నందుఁ గలుగు నును పెఱిఁగితివే. 185

క. నావుడు కమలాకరుఁ డను
దేవా నీ వానతిచ్చితివి నిజ మది వి
ద్యావారిధి కడ గానఁగ
నావారిజభవునకైన నలవియె తలఁపన్. 186

ఆ. అట్ల యయ్యు సంస్కృతాదిభాషలు నేర్చి
కవిత యెఱిఁగి యెల్లకడలఁ దిరిగి
తెలిసినాఁడ నిచటఁ గల లక్షణముకంటె
నూతనంబు లేదు భూతలేంద్ర. 187

క. గణములు గణవర్ణంబులు
గణతారలు గణరసములు గణదేవతలున్
గణజాతులు గణఫలములు
గణుతింపఁగ నొక్కవిధమ కవితల కెల్లన్. 188

వ. ఇట్టి విధం బయ్యను నంధ్రమండలంబునం [1]గోనదేశంబునం దెలుఁగుంగవితకు వ్రాలు[2] - వళ్ళు నను నియమంబులు చూచినాఁడ నవి యియ్యెడం డఱచు గాకుంట నపూర్వం బవధరింపుము. 189

  1. గోణదేశంబున
  2. వ్రాలు-ప్రాలునని రెండురూపములు గలవు.