పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 181

వ. అభిజ్ఞుండై గురునానతిపడసి తిరిగి దేశవిశేషంబుల జూడం జరియించుచు నొక్కనాడు. 174

క. కాంచనమణిమయరుచికలి[1]
కాంచితనిజసాలవలయ మై భూమిసతీ
కాంచీగుణ మన మించిన
కాంచీపట్టణము నతఁడు గాంచెం గడఁకన్. 175

క. ఆనగరమునకుఁ జని జయ
సేనుం డనురాజుచేతఁ జిత్రంబగు వి
ద్యానిపుణతఁ బూజ్యుండై
యానెపమునఁ గొన్నిదినము లచ్చట నిలిచెన్. 176

వ. అంత నొక్కనాఁ డతనియెదుట విటలోకమోహిని యను వారకామిని లలిత విలాసినియై పొలసె నది యెట్టి దనిన. 177

సీ. శృంగారరసములోఁ జేవశోధించి వి
రించి యీసతి నొనరించె నొక్కొ
మెఱపులన్నియుఁ గూర్చి మెదపి రూపుగఁ జేర్చి
యీసరోజాననఁ జేసెనొక్కో
కాక బంగారులోఁ గాంతిసాధించి యీ
చంచలనేత్రఁ గావించెనొక్కో
యుడురాజుఁ జేపట్టి పిడిచి సారంబున
నీపడంతుక రచియించెనొక్కొ
ఆ. చక్కఁదనమునెల్ల నొక్కచోటనుగూడఁ
గూర్చి యీనెలఁత నొనర్చెనొక్కొ

  1. కాంచనమయతటరుచికలి, కాంచిత - కాంచనమణిమయ తటరుచి కాంచిత-