పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180 సింహాసన ద్వాత్రింశిక

క. పరభూమికిఁ జనుచోఁ ద
స్కరులకు నగపడదు వ్రేఁగుగా దెచ్చట నె
వ్వరి నైన హితులఁ జేయును
ధరలో మఱి విద్యఁబోల ధనములు గలవే. 170

ఉ. గద్యముఁ బద్యముం బెనుపఁ గైకొను టొండె, ధ్రువాప్రబంధసం
పద్యుతుఁ డౌట మొండె, మృదు భాషలఁ బ్రొద్ధులు పుచ్చుటొండె, లో
కోద్యమలక్షణం బెఱుఁగు టొండె, గడు సృజియించుఁగాక యే
విద్యలు నేరఁ డేనిఁ పశువే యగుఁగాదె గణించి చూచినన్[1]. 171

శా. సంగీతంబుఁ గవిత్వతత్త్వమును సౌజన్యంబు భావంబు స
త్సాంగత్యంబు నెఱుంగఁ డేని భువి నాశ్చర్యంబుగా వాలమున్
శృంగద్వంద్వము లేని యె ద్దతఁ డనం జెల్లుం దృణం బాతఁ డ
య్యాంగీకంబున మేయఁ డాపసులభాగ్యం బిచ్చటం గల్గుటన్. 172

సీ. అనుచు నెగ్గించిన నాకమలాకరుం
డభిమానియై తనయాత్మలోన
విద్యలు నేర్చి వివేకినై కాని యీ
జనకువక్త్రము చూడననుచు వెడలి
కాశ్మీరదేశంబుకడ కేఁగి యొకయోరఁ
జంద్రకేతుం డనుసంజ్ఞఁ బరఁగు
నుత్తమద్విజుఁ గొల్చియుండగా నాతండు
క్రమమున సిద్ధసారస్వతంబు
తే. కరుణ నొసఁగిన నతఁడు సాంగంబు గాఁగ
నాల్గువేదములును గావ్యనాటకములు
దర్శనంబులు నీతిశాస్త్రములు దివిరి
కలయ సంగీతసాహిత్యకళలు నేర్చి. 173

  1. విద్యలు నేరఁడేని బృధివిం బశు వాతఁడెగా గణింపఁగన్