పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184 సింహాసన ద్వాత్రింశిక

వరుణుని ముందఱఁ బరిచారకులు నిల్వఁ
బట్టిన రత్నదర్పణ మనంగ
నస్తాచలం బను హస్తిమస్తకమునఁ
దిరమైన రక్తచామర మనంగ
తే. నిఖిలదిగ్వలయాంతమాణిక్య మనఁగ
నిట్ట ప్రాఁకిన పవడంపుఁజుట్ట యనఁగ
గట్టుతుద నున్న జేగుఱుగ ల్లనంగ
నరుణమండల మొప్పె దినాంతమందు. 94

క. అయ్యెడ నర్కునిమండల
మయ్యచలము డిగ్గి పశ్చిమాంబుధి సొచ్చెం
వయ్యందిఁగాఁచి కమ్మరి
చయ్యనఁ బదనిచ్చు నుక్కుచక్రము మాడ్కిన్. 95

తే. ఏ విధమున మలక లైన దైవగతిని
సొమ్ము వానిన మఱి చేరు సొమ్ము నాఁగఁ
ద్రిభువనము లెల్లఁ గలయంగఁ దిరిగి గగన
రత్న మప్పుడు రత్నాకరమునఁ గలసె. 96

క. నెఱసంజఁ గ్రుంకు గుబ్బలి
చఱి జఱజఱ నినుఁడు డిగ్గజాఱుచుఁ జనునా
తఱి నఱిముఱి నెగసిన [1]జే
గుఱుధూళి యనంగఁ గెంపు గుఱికొని పర్వెన్. 97

క. మిన్నందెడుతేజంబున
నెన్నంగల యినుఁడు దీఱె నిదె యెడ రనుచు

  1. తఱివడితో నెగసినజేగుఱు