పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 155

సన్న్యాసంబును జేఁత పంత మని మాత్సర్యంబుతో నాత్మసౌ
జశ్యం బెల్ల దొఱంగి[1] లేచి చనుచో సంకల్పసంసిద్ధికై .49

క. సద్భావము గైకొని ర
త్నోద్భవుఁ డిఁక దైవబలమ యుచితం బని తా
నద్భుతముగ మ్రొక్కుచు నిట
మద్భవనముఁ జొచ్చె దురభిమానము పేర్మిన్. 50

క . గుడిసొచ్చి నాకు సాఁగిలఁ
బడి మ్రొక్కుచుఁ బలికె నెన్నిభంగులనైనం
బడఁతుక యిది నా కబ్బిన
మిడిదల యొప్పించి నిన్ను మెప్పింతుఁజుమీ. 51

చ. అని యొడఁబాటు చేసి వినయంబున మ్రొక్కుచు నేఁగి చంద్రకే
తునిపని కేతు వుట్టఁ దనదొడ్డతనంబు నటించి రత్నకాం
చనమయ మైన దీవి రభసంబునఁ జేరి కడంకఁ గన్యకా
జనకుని గాంచి చెప్పె నిజసంవరణోద్యమ మప్పు డేర్పడన్. 52

సీ. ఆతఱి నాచంద్రకేతుండు చనుదెంచి
తనరాక చెప్పినఁ దద్గురుండు
నిద్దఱ కర్చన లిచ్చినఁ దాఁబూల
గంధపుష్పాక్షతల్ గైకొనంగఁ
దొడవులకెల్లను దొడవైన కన్నియఁ
దొడమీఁద నిడుకొన్న యెడ నొకండు
తెల్లసంపెంగలు దివ్యంబు లివి యని
సమముగా నిచ్చినఁ జంద్రకేతుఁ

  1. దొలంచి