పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150 సింహాసన ద్వాత్రింశిక

ద్ధరాజన్య జన్యాగతానన్యసాడృశ్యదృశ్యాంగ హృష్యజ్జరాసంధసంధానయంత్రాదియత్న క్షయాదాయి నీతిశ్రితాసార! సారాంతరజ్ఞానదాసాహితధ్యాన సన్నద్ధతేజ! కళాసంచితానంద! నందాంతరంగాంతరంగన్నిజానందినీరాకరాకారరాకానిశాధీశ! ధీశస్తసంచారసంచేయ సత్కీర్తినారీలసన్నారదారాధితాచార ధీరాంగనానాయకాద్యంతరాజాతశాస్త్రార్థసారాశయాగణ్య! గణ్యాకృతిచ్చాయ రాధానిరంతస్తనాద్రిస్థలక్రీడనాయత్తచిత్తస్థిరాసక్తిలీలానటీరంగ రంగస్థలీసాధనాహృష్టదుష్టాహితాభేదనాకాలసంజాతరాగాఢ్యనేత్రాంతకంసారి హింసాకళాదక్ష! దక్షక్రియానాశనాకారారకాశాకరేశాదిగర్జద్గణాధీశస్త్రీసహస్త్రీజయశ్రీరణాసార నిస్సారితాకారి నీరంధ్ర తేజోలసచ్చక్ర! చక్రాకృతి శ్లాఘనీయాంతశార్గ్ఙాతతజ్యాలతానిర్గతాఖండకాండాగ్ర ఖండీకృతారాతి సంఘాత! ఘాతస్థలత్కాళియాహీంద్ర శీర్షాళిరంగక్షితిక్రీడనాహర్షణాళ్చర్య కార్యాంగహారాయతిజ్ఞాన సత్యక్షణాసక్తచిత్తాదితేయాదిసిద్ధాంగనాకిన్నరీయక్షసంకీర్తితానంతకీర్తిస్రగాధార! ధారాళధారాధరాకాశనీలాంజనేందిందిరానీల సచ్ఛీకర గ్రాహకాళింది హేలాకరాళాగ్రహస్తాది విశ్రాంతి సాంగత్యశాంతాది సంతత్యహంకార! కారాగతారాతినారీకనక్తంచరాధ్యక్షనిశ్శేషణీశాతనాకేళిఖేలజ్జగజ్జాల! జాలాంతగాఢాంధకారచ్చిదానంద కృత్యాకరాదిత్య నిత్యాహితస్నేహసంరక్షితాశేష రక్షస్సతీసంఘదృక్కజ్జలక్షాళనాశీలధారా జలాధారఖడ్గాగ్ర లగ్నాహితానీకరక్తాధరస్మస్తనాళాంతరాసంగి సంగీతసంతుష్టసారంగరంగత్తరంగాదిగంగానదీకారణాంఘ్రి స్థిరానంద సంక్రందనాగ్న్యర్క జాతాదితేయారినీరాధినాథానిలార్థేశ గంగాధరాద్యష్టదిగ్రక్షకశ్రేణికా శేఖరానర్ఘ్యరత్నాళినీరాజనారాజితాకార కాంతిచ్ఛటాకాంత సంధానితాలీల! లీలాలసచ్చారిణీగీతనీరేజసంచారిణీ రాజరాజాగ్రణీ. 24

మ. అనుచుం బెక్కువిధంబులం బొగడి సాష్టాంగంబుగా మ్రొక్కి ధ
న్యునిఁగాఁ దన్నుఁ దలంచి కొంచు జనమన్యుం డౌచు నుజ్జేని క