పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 149

దప్పనియోజతోఁ దనపిన్నపాపల
నాడింపఁ దెల్లని కోడ లుండఁ
గలిమియౌ నిల్లాలు కలిమినీనెడుచూడ్కిఁ
బెంపుడుబిడ్డలఁ బెంచుచుండఁ
గమ్మని యమ్ములు గల్గు ముద్దులపట్టి
చిల్లంగి చేతలు చేయుచుండఁ
ఆ. గాలివ్రేలఁ గన్నగారాబుఁగూఁతురు
మొదలివేల్పుఁ గూడి మురియుచుండ
నల్లపాలవెల్లి యిల్లుగాఁ గాఁపుర
మెఱిఁగి చేయు మేటి దొరవు నీవ. 22

సీ. పాదతీర్థం బతిపావనం బగుటకు
శిరమున నిడుకొన్న శివుఁడు సాక్షి
కలఁడన్న నెందైనఁ గలుగుట కుర్విలోఁ
బంబిన యుక్కుఁగంబంబు సాక్షి
తలఁచిన యంతనె తలఁగక యర్థుల
రక్షించుటకుఁ గరిరాజు సాక్షి
యాచంద్రతారార్కమగు దానశక్తికి
ధ్రువపదంబున నుండు ధ్రువుఁడు సాక్షి
తే. తాలిమికిఁ గాలఁ దన్నిన తపసి సాక్షి
భాగ్యమున కాదిలక్ష్మి చేపట్టు సాక్షి
త్రిభువనగురుండ వగుట విరించి సాక్షి
నిన్ను వర్ణింప నలవియె నీరజాక్ష. 23

నిరోష్ట్యదండకము :- జయకృష్ణ! జయకృష్ణ; కృష్ణ! స్థిరాస్యందనస్థాన నానాదినధ్యాన నానాసితానేక సేనారజోనీక రథ్యాతిరథ్యాళి సన్నాహస