పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xx

ఆ భూమిలో ఆ బ్రాహ్మణవంశీయుడు మంచె వేసికొని చేనులో పైరుపెట్టి కావలి యుండును. భోజరాజు సైన్యములతో నచటికి రాగా మంచెపై ఉండి ఆహ్వానించును. మంచె దిగి దూషించును. భోజరాజు ఆ భూమిని కొని, మంచె ఉన్నచోట త్రవ్వింపగా సింహాసనము కనబడును, ఎంత ప్రయత్నించినను ఆది వెలికిరాదు. మంత్రి సలహా మేరకు శాంతులు చేయగా వెలికి వచ్చును. మంత్రి ఆవశ్యకతను తెలుపు బహుశ్రుత్రుని (ససేమిరా) కథ, ఏకలునికథ, వులిపులుగు కథ చెప్పబడినవి. భోజరాజు శుభదినమున సింహాసన మెక్కబోగా మొదటిమెట్టుపై ఉండిన బొమ్మ భోజుని ఆపి విక్రమార్కుని వంటి సాహసౌదార్యములు కలవాడే ఈ సింహాసమెక్కుటకు అర్హుడని చెప్పును. ఇట్లే తక్కిన 31 బొమ్మలును ఒక్కొక్క కథ చెప్పును.

మొదటి బొమ్మ కథ- మూలమునందలి కథతోబాటు అదనముగ సుదర్శనుని కథ. చతురంగ తజ్ఞుని కథ చేర్చబడినవి.

రెండవ బొమ్మ కథ- మూలములోని కథనే చెప్పును.

మూడవ బొమ్మ కథ- మూలమందలి కథతోబాటు గౌశికుని కథ చేర్చబడినది.

నాలుగవ బొమ్మ కథ- మూలకథనే చెప్పును.

అయిదవ బొమ్మ కథ- మూలకథనే చెప్పెను.

ఆఱవ బొమ్మ కథ- మూలకథనే చెప్పెను

ఏడవ బొమ్మ కథ. మూలకథయే.

ఎనిమిదవ బొమ్మ కథ- మూలకథతో బాటు శంఖపాలుని కథ అదనముగా చెప్పబడినది.

తొమ్మిదవ బొమ్మ కథ- మూలకథయే.

పదవ బొమ్మ కథ- మూల - కథయే. .

పదునొకండవ బొమ్మ కథ. మూలకథతో బాటు జీమూతవాహనుని కథ చెప్పబడినది.