పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 139

క. కామినులు చేరి మెలఁగం
గా మును నిర్మలము నధికగంభీరము నౌ
నామడుఁగు గలఁగె ననఁగాఁ
గాముకచిత్తములు దానఁ గలఁగుట యరుదే. 182

క. పొలఁతులతనువుల జాఱిన
మలయజమును విరులు నెరయ మడుఁగొప్పె సము
జ్జ్వల మగువెన్నెలఁ జుక్కలు
గలయంగొని నిండియున్న గగనము భంగిన్. 183

వ. అంత జలకేళి చాలించి. 184

ఉ. కన్నులఁ గెంపు దోఁప నలికంబుల మౌక్తికజాలకాకృతిన్
సన్నపుబిందువు ల్మెఱయ జాఱిన కేశభరంబు లొప్పఁగాఁ
జన్నులనంటి పయ్యెదలు చందనపంకముచంద మందఁగా
నన్నరనాథుతో వెడలి రంబురుహాకర మంబుజాననల్. 185

వ. అంతం దదీయతటప్రదేశంబున ముక్తసిక్తవసనుం డగుచు వసుంధరారమణుండు మెత్తనిపొత్తులం దనమేని తడియెత్తిన యనంతరంబ. 186

ఆ. మలయజంబు నలఁది మౌక్తికహారంబు
లమర నుజ్జ్వలాంబరములు గట్టి
యమృతవీచి మిశ్రమై విశ్రమించిన
మందరాద్రిఁ బోలె మనుజవిభుఁడు.187

వ. అట్టిచందంబున నాచందనగంధులును జందనకావులును బట్టెడకాపులును జెంగావులును గదంబకావులును గరకంచులును బొమ్మంచులును ముడుగుబొమ్మంచులును ముయ్యంచులును జిలుకచాళ్ళును వేఁటచాళ్ళును నిండువన్నెలును నుఱుతచాఱలవన్నెలును గంటకివన్నెలును బుప్పొడివన్నెలును రుద్రాక్షవన్నెలును నాగబంధంబులును బూజాబుధంబులును జలపంజరంబులును గామవరంబులును సూరవరంబులును దారామండ