పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136 సింహాసన ద్వాత్రింశిక

ఉ. దేహము లాకుఁదీఁగెలకుఁ దేఁకువ సూప నవీనగుచ్ఛక
గ్రాహక లైనకాంతలకు ఘర్మజలం బుదయించుచుం బ్రియ
స్నేహరసాకృతిం జెలువు చేకొనఁగా మకరందబిందుసం
దోహసమావృతంబు లనఁ దోఁచెఁ దదీయముఖారవిందముల్. 167

ఉ. కాంతుఁడు వోలె సోలి యలకంబులుఁ బయ్యెద లొత్తుచు న్వన
శ్రాంతులు దీర్చుచు న్మిగులఁ జల్లనివాసన నావనస్థలో
పాంతనిదాఘవారికణహారివిహారి యనంగ నింతుల
న్సంతస మందఁజేయుచు వసంతసమీరుఁడు వీచె నయ్యేడన్. 168

ఆ. పువ్వుఁబోఁడు లంతఁ బుష్పాపచయకేళి
చాలు ననుచు నాత్మసఖులఁ గూడి
భూతలేంద్రుఁ డొక్కచూతతరుచ్ఛాయ
నుంట దెలిసి వేడ్క నొయ్య మగిడి. 169

క. మనసిజునకుఁ బొడసూపెడు
వనదేవత లనఁగ వచ్చి వనజానన లా
జననాయకునిం బువ్వులు
కనుకనిఁ గానుకలు చేసి కనుఁగొని రచటన్. 170

క. క్రొక్కారు మెఱపుగములను
లెక్కింపను సోయగముల లీలలుగల యా
చక్కనివనితలలోఁ బతి
చుక్కలలోఁ జంద్రు భంగిఁ జూడఁగ నొప్పెన్. 171

వ. ఇట్లు తరుణీగణపరివృతుండై యచ్చటు వాసి చని పురోభాగంబున రంభాస్తంభశోభితంబును మృగనాభిలిప్తంబును ఘనసారరంగవల్లీతరంగితంబును బూర్ణకలశాలంకృతంబును మరువకావృతపర్యంతంబును నగువేదీమధ్యంబున నరపతి రతిరాజానువర్తియైన ఋతుచక్రవర్తి నర్ఘ్యపాద్య