పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134 సింహాసన ద్వాత్రింశిక

శ్రాంతంబు దీనికై మదిఁ
జింతించుటఁ జేసి పరఁగెఁ జింత యనంగన్. 157

క. మును జిగురునఁ బువ్వున నో
మనగాయల దోరపండ్ల మఱి యారఁగఁబం
డినపండ్ల నెల్లకాలముఁ
దనియఁగఁ జవు లొసఁగ నొండు తరువులు గలవే[1]. 158

క. ఉడుపతి తనలో నమృతము
గడలుకొనియుఁ బెక్కుచవులు గానక కృశుఁడై
విడిచినకళ లన్నియు నీ
గొడిసెల రూపమునఁ జింత గొలువఁగఁబోలున్. 159

క. వెస నిర్మించిన బ్రహ్మకు
రసికుఁడు మ్రొక్కిడుచు ఫలము రంజిల్లఁగ ష[2]
డ్రసములలో నిది నమలెడు
దెసఁ గని నోరూరు నాదిదేవునికైనన్. 180

ఆ. గరిత లేని యిల్లు దొర లేని తగవును
జింతపండు లేని వింతచవియుఁ
జనవు లేని కొలువు శశి లేని రాత్రియు
ముక్కు లేని మొగము నొక్క రూపు. 161

మ. అని యిబ్భంగి విదూషకుండు చనవున్ హాస్యోచితం బైన చొ
ప్పునఁ దద్జ్ఞత్వము నేర్పడం బలుకుచు స్భూభర్తకు న్వాగ్వినో
దనసౌఖ్యంబులఁ బ్రొద్దుపుచ్చునెడ నుత్సాహంబుతోఁ గామిను
ల్వనసౌందర్యవిలోకలోలమతులై వర్తించి రయ్యైయెడన్. 162

  1. జవు లొసఁగుచుండుతరువులు గలవే-నిట్టితరువులు గలవే
  2. రసికుఁడు “హణ్నుళ నున్నరె, నొసవి" యనుచుఁ గన్నఁడీఁడు నుడువఁడె