పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130 సింహాసన ద్వాత్రింశిక

యుదధిభంగిఁ దత్పురోద్యానవనభూమి
మాధవాశ్రయమగుమహిమఁ దాల్చె. 135

ఉ. గంధవహుండు వేగరి పికంబులు గాయకపంక్తి మత్తపు
ష్పంధయము ల్బలంబు శుకసంఘము మంగళపాఠకుల్ మహా
బంధురకార్యవాది నిజబంధుఁడు చంద్రుడు మంత్రిగాఁగ గ
ర్వాంధుఁడు మన్మథుండు దనయాజ్ఞ దలంబుగ నేలెఁ దత్పురిన్. 136

క. తత్సమయంబున భూవరుఁ
డుత్సాహము రాజవృద్ధియును మెఱయ వసం
తోత్సవ మొనరింపుద మని
యుత్సుకుఁ డై కదలె వైభవోద్రేకమునన్[1]. 137

వ. తదనంతరంబున. 138

సి. మంజులమంజీరశింజారవంబులు
వీనుల కందంద విందు లొసఁగఁ
గాంచనకాంచీప్రకాశవిలాసముల్
వలపుల పసిఁడివన్నియ నిగుడ్పఁ
దారహారోజ్జ్వలస్తనకుంభదీప్తులు
ముఖచంద్రకళలతో ముచ్చటాడఁ
దాటంకరోచులం దఱిమిన కన్సోఁగ
మెలఁకువ లిరుదెస మెఱుఁగులీన
ఆ. జల్లిముత్తియములు మొల్లపూదండలు
దల్లితోడుభంగిఁ దడఁబడంగ
వలయరత్నరుచులు కెలఁకులఁ బొలయంగఁ
దలిరుఁబోఁడు లెదుర నిలిచి రిట్లు. 139

  1. వైభవోత్సకము