పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122 సింహాసన ద్వాత్రింశిక

సీ. ధూళి పర్వఁగఁ వడిఁ దూర్పువాఱెడుగాడ్పు
సారతురంగప్రసార మనఁగ
సంపూర్ణజలమదశ్యామలాకృతు లైన
యంబుదంబులు కుంజరంబు లనఁగ
భూరిగర్జితములు భేరిరవము లన
మెఱుపు లాయుధముల మెఱుఁగు లనఁగఁ
గేకినాదములు మహాకాహళము లనఁ
జాతకంబులు భృత్యసంఘ మనఁగ
తే. శక్రచాపము[1] విజయధ్వజం బనంగ
నొప్పి భూతవిహిత[2] జీవనోదయమున
నవనినాయక నీదువాహ్యాళిఢాక
ననుకరించుచుఁ దోఁచె వర్షాగమంబు. 96

సీ. తొలితొలి సన్నంపుఁదుంపురు లొలుకఁగా
వెసఁ దిమితిమి యని[3] ముసురువట్టె
బిసబిస యని గాలి బెట్టుగాఁ బెటపెట
గణికలంతంతలు చినుకు లురిలెఁ
బిడుగు పెఠిల్లునఁ బడియెనో యనఁగను
గడిఁదియుర్ములు బెడబెడ యనంగఁ
గ్రొక్కారుమెఱుఁగు తళుక్కని మెఱయఁగాఁ
హాసియుఁజీఁకు చూపఱఁ బెనంగ
తే. నించి కడవలు వడిఁ గ్రుమ్మరించినట్లు
పాము వ్రేలాడఁగట్టినభంగి దోఁప

  1. చక్రవాకము
  2. నొప్పు భూగోళహితజీవ
  3. నెసనిదేమిటియని