పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3)

xvii


దర్శించును. ఆయన ప్రసాదించిన కస రసాయనములను ఒక బ్రాహ్మణ కుటుంబమునకు ధారపోసిన కథ చెప్పును.

వింశోపాఖ్యానము - ఇరువదవ సాలభంజిక , విక్రమార్కుడు ఒక మహా సిద్దునిచే మహిమగల ఘుటికను, బొంతను, యోగదండమును సంపాదించి దారిలో రాజ్యభ్రష్టుడగు ఒక రాజకుమారునకు సమర్పించిన కథ చెప్పును.

ఏకవింశోపాఖ్యానము - ఇరువది యొకటవ సాలభంజిక విక్రమార్కుడు మంత్రిపుత్రుడైన అనర్గళుని వలన వివి ఒక పుష్కరిణిలో సలసల క్రాగుచున్న నీళ్ళలో నుండి రాత్రిపూట బయటికి వచ్చిన 8 మంది స్త్రీలననుసరించి పాతాళమునకు పోయి, వారిచే 8 దివ్యరత్నములను పొందివచ్చి దరిద్ర బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును.

ద్వావింశోపాఖ్యానము- ఇరువది రెండవ సాలభంజిక, నీలపర్వత బిలములోని కామాక్షీదేవిని మెప్పించి విక్రమార్కుడు అందున్న రసకుంభమును దెచ్చి బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును.

త్రయోవింశోపాఖ్యానము - ఇరువదిమూడవ సాలభంజిక, విక్రమార్కుడు దుస్వప్న శాంతికై హవనము చేసి 3 దినములు తన భాండాగారమును తెరచి యుంచి యథేచ్చగా దానములు చేసిన కథ చెప్పును.

చతుర్వింశోపాఖ్యానము - ఇరువదినాలుగవ సాలభంజిక, ఒక వర్తకుని పుత్రులకు తండ్రి చేసిన భాగ పరిష్కారము అర్థముకాక అన్ని దేశములు తిరిగి ప్రతిష్ఠానపురములోని శాలివాహను డనుబాలునిచే ఆ వివరము తెలిసికొందురు. విక్రమార్కుడీ వార్తవిని శాలివాహనుని పిలువ బంపగా, వాడు తిరస్కరించును. దానిని సహింపక శాలివాహనునిపై దండెత్తి వానిచే సైన్యములు చావగా వాసుకిని ప్రార్థించి అమృతకలశమును సంపాదించును. దానిని శాలివాహనుడు పంపిన బ్రాహ్మణులకు దానమిచ్చిన కథ చెప్పును.