పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118 సింహాసన ద్వాత్రింశిక

ఐదవబొమ్మ కథ

క. తెల్లని యమృతాంబుధిలో
నల్లని తిరుమేను ధవళనలినములోనం
ద్రుళ్ళెడు తుమ్మెదక్రియ రా
జిల్లఁగ విహరించుచున్న సిరివరుఁ కొలుతున్. 75

మ. అని చిత్తాబ్దములోఁ దలంచి సమయజ్ఞామోదితం బౌ దినం
బున సౌమ్యగ్రహదృష్టలగ్నమున నాభోజుడు వేడ్క న్మహా
సన మెక్కంజని పాదపద్మ మిడఁ జాల్చాలంచు నచ్చోటు కాం
చనపాంచాలిక వల్కె సర్వజనతాశ్చర్యం బవార్యంబుగన్[1]. 76

క. కార్యం బెఱుఁగవు దానా
చార్యుండగు విక్రమర్కు సరిపూనఁగ గాం
భీర్యముతోఁ గూడిన యౌ
వాక్యము లే కేల యెక్కఁ దర మగు నీకున్. 77

క. అనవుడు విస్మితుఁ డై మీ
జనపతి గాంభీర్యదానచాతుర్యము లే
పనిపట్టులఁ గనుపట్టిన
వని యడిగిన భోజనృపతి కది యి ట్లనియెన్. 78

శా. ధారానాయక యాచకార్తజనతాదారిద్ర్యవిద్రావణుం
డారూఢస్థిరకీర్తివల్లివిభవవ్యాప్తాఖిలాశాంతవి
స్తారుం డూర్జితవిక్రమక్రమనిరస్తక్షోణిపాలాగ్రసం
భారోత్సాహుఁడు సాహసాభరణుఁ డొప్పం జేసే రాజ్యం బిలన్. 79

క. భూతలమునఁ బుణ్యగుణ
ఖ్యాతుం డగు నతని చేతి కౌక్షేయకధా

  1. ఆశ్చర్యంబు కార్యంబుగన్