పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 111

ఆ. నాభి నెఱయవిరిసె నడుము నొవ్వఁదొడంగె
దాదు లంత నాయితంబు చేసి
కూడిమెలఁగ దండికుట్టులం బొదలక
నాతి యటు సుఖప్రసూతి యయ్యె. 39

క. క్రూరగ్రహవిరహితుఁడగు
తారాపతిబలము గలుగు తత్కాలమునన్
మారునికెనయనఁదగినకు
మారుం డుదయించె హితులమది ముదమొందన్. 40

వ. అప్పుడు దాదులు. 41

ఆ. నిసువుబొడ్డుమీదఁ బసిఁడిటంకం బిడి
యొయ్య నాభినాళ ముత్తరించి
ముత్తియములఁ జేట ముంచి యందిడి కను
దమ్ములందు సమ్మదమ్ము నిగుడ. 42

క. [1]కలిఁదోఁచి నూనెవ్రేలిడి
తలపుఱ్ఱియయందు నేతితైలంబును జొ
త్తిల రాచి మెత్తగాఁ బొదు
గలరించి[2] కుమారు నునిచి రాదాదు లటన్. 43

శా. క్షోణీనాయకుఁ డిట్టిమేలు విని సుస్నాతుఁడై యాదిక
ళ్యాణం బైన మహోత్సవంబున సముల్లాసంబుతో దానపా
రీణుండై నిజబంధులోకగురుధాత్రీదేవసంసేవన
త్రాణం బొప్పఁగఁ బెట్టె గోధరణిరత్నద్రవ్యమాద్యంబుగన్. 44

సీ. క్రమమున దాదు లక్కడను ముప్పటిలిన[3]
జలకంబు దేర్చి యాచెలువసుతుని

  1. కలిగడిగి
  2. పొదుగుపొత్తులు
  3. ముప్పటములైన, చిన్నయసూరి