పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110 సింహాసన ద్వాత్రింశిక

క. నెలకొనినచూలువేళల
దలకొని మెయిదీఁగ మెఱుఁగు దనరం గనకో
జ్జ్వల మగు వేషంబున సతి
పులుకడిగినముత్తియందు పోలిక నొప్పెన్. 34

ఆ. [1]ఇంతి మదిఁ దలఁకుచు నెడమప్రక్క నిదిగొ
మెదలె ననుచుఁ జెప్ప సుదతులంతఁ
జంటిజిగురు గోర సంధించి చిరజీవి
యైనసుతుఁడు పుట్టు ననఁగఁ బొంగు. 35

క. ఆసతి కానృపు డష్టమ
మాసంబున గెంటలం బమరఁబెట్టి[2] మహో
ల్లాసంబున నుండఁగ నవ
మాసంబులు నిండె గర్భమహిమయు నలరన్. 36

తే. చన్ను లురియఁ[3] బొదలె జఘనంబు ఘనమయ్యె
బలకవెన్నుదనరె మలుగువట్టె
రాజయోగ్యమైన రత్నంబు దాఁచిన
పసిఁడిపెట్టె యనగా నెసఁగె నపుడు. 37

క. నెలఁత శిశువునకుఁ బ్రొద్దుల
నెల నమృతమునించు నింద్రనీలపుమూఁకు
ళ్ళలరించిన బంగారపుఁ
గలశము లనఁ గుచయుగంబు కప్పున నొప్పెన్. 38

  1. తొలుతచూలున మది దలఁకు నెడమ ప్రక్క...చంటిజేలు గోరనంటి...సుదతి వుట్టుననిన సుదతి పొంగు (చంటిజిలుగు)
  2. గెంట్లమమర
  3. విరియ