పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109 తృతీయాశ్వాసము

పెక్కెఁ గనుంగవ న్మెఱపు లేర్పడె నప్డు మనంబుకోరుకుల్
పెక్కుఁవిధంబులం బరఁగెఁ బ్రీతిగ నాతికిఁ జీర చిక్కినన్. 28

క. పొత్తికడుపు మెఱుఁగెక్కెం
జిత్తంబున జడను దోఁచెఁ జెలికత్తెలతో
నొత్తిలిపలుకఁగ మ్రాన్పడు
మెత్తనిమై నడుఁచుని[1] నిదుర మేకొను విసువున్. 29

క. కొమ్మకుఁ బులు సింపయ్యెను
గమ్మని మ న్నంతకంటెఁ[2] గడుఁ జవికెక్కెం
దమ్మిమొనమొగ్గ లెక్కిన
తుమ్మెద లనఁ జన్నుదోయితుద కప్పారెన్. 30

ఆ. చెలువ బయఁకలైన జెవ్పవేటికి నన్న
సిగ్గుపడుచుఁ జెలువచెంత దలఁగుఁ
జెప్పంబూను గొన్ని చిహ్నంబు లెఱిఁగించు
నగవుచేసి మీఁదనొగులుచేయ[3]. 31

క. విశదముగ నడిగి యారా
జశిఖామణి కెఱుఁగఁ జెప్పి సఖులిం పగుస
ర్వశుభంబులు గూరిచి త
చ్ఛిశువునకు న్మీఁదఁ జీకుచెవి[4] గాకుండన్. 32

తే. మూఁడునెలలఁ జెలులు ముద్దలు[5] వెట్టిరి
యలరుఁగుడుము లైదునెలలఁ బెట్టి
రేడునెలల మ్రొక్కి రెఱ్ఱపోలమ్మకు
సతికిఁ జూలువెళ్ళ జరుపుకొనుచు. 33

  1. మెత్తనినడమెలఁగు
  2. గమ్మఁదనంబంతకంటె
  3. నగము చేసి మీఁద నొగులు దెలియు
  4. చీడచెవి-జీపుచెవి, చీద చెవి
  5. ముద్దాలు