పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xvi


రక్షించి ఆ బ్రాహ్మణుడు ధారపోసిన చ్వాదశవర్ష మంత్రజప ఫలమును బ్రహ్మరాక్షసునకు సమర్పించిన కథ చెప్పును.

చతుర్దశోపాఖ్యానము - పదునాల్గవ సాలభంజిక విక్రమార్కుడు తనకు సిద్ధయోగి ప్రసాదించిన సర్వకామద మయిన మహాలింగమును ఒక బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును.

పంచదశోపాఖ్యానము - పదునైదవ సాలభంజిక విక్రమార్కుడు తన పురోహిత పుత్రునితో వెళ్ళి ఒక నగరములో దేవాలయ గోపురమునగల తప్తతైలకటాహమున దూకి మన్మథ సంజీవిని ఆను అప్పరసచే బ్రతికించబడి ఆ అప్సరసను పురోహితపుత్రునకు సమర్పించిన కథ చెప్పును.

షోడశోపాఖ్యానము - పదునాఱవ సాలభంజిక విక్రమార్కుడు దిగ్విజయ యాత్ర చేసివచ్చి, పురబాహ్యోద్యానమున విశ్రమించి యుండగా, ఒక బ్రాహ్మణ కన్యకు ఆమెబరువు బంగారము నిచ్చి పెండ్లి చేసిన కథ చెప్పును.

సప్తదశోపాఖ్యానము - పదునేడవ సాలభంజిక ఒక రాజు విక్రమార్కునితో సాటి అగుటకు ప్రతినిత్యము తనను హోమము చేసికొనుచున్నట్లు విని, విక్రమార్కుడు వెళ్ళి, ఆచటి దేవతను మెప్పించి, ఆ రాజునకు నిత్యబలి తప్పించిన కథ చెప్పును. . అష్టాదశోపాఖ్యానము- పదునెనిమిదవ సొలభంజిక ఉదయాద్రి దగ్గర గంగానదిలో ఒక స్తంభము సూర్యోదయముతో పైకి లేచి, మధ్యాహ్నమునకు సూర్యుని సమీపించి, అస్తమయమునకు నదిలో మునిగిపోవుచుండుట విని విక్రమార్కుడు వెళ్ళి ఆ స్తంభముపై కూర్చుండి సూర్యుని కడకు వెళ్ళి మెప్పించును. సూర్యుడిచ్చిన దివ్య కుండలములను ఒక దరిద్ర బ్రాహ్మణునకు సమర్పించిన కథ చెప్పును.

ఏకోనవింశోపాఖ్యానము - పందొమ్మిదవ సాలభంజిక విక్రమార్కుడు వేటలో వరాహమును తరుముచు వెళ్ళి, పాతాళము చేరి, బలి చక్రవర్తిని