పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108 సింహాసన ద్వాత్రింశిక

జిక్కి మది న్వితాకు పడి చింత మునుంగుచుఁ బండ్లుగోయఁగా
నొక్కెడ దేవదత్తుఁ గని యూరికి నేగెడుత్రోవ వేఁడినన్. 22

ఆ. హయమువాగె వట్టి యల్లన ముందట
ముండ్లు దప్పఁ దిగిచి గండ్లు గడపి
దేవదత్తుఁ డిట్లు తెరువునఁ గూర్చిన
సేన గలసె రాజశేఖరుండు. 23

క. తన యెక్కినతురగము నా
తని కిచ్చి సువర్ణనిర్మితం బగు వరవా
హనమున నొయ్యనఁ బురికిం
జనుదెంచెను బంచవాద్యశబ్దము లులియన్. 24

వ. ఇట్లు చనుదెంచి నగరు ప్రవేశించి మహావిభవంబు మెఱయం గొలువునం
గూర్చుండి. 25

ఆ. అచటి విప్రునిపని యత్యుపకారంబు
గాఁ దలంచి యొక్కగ్రామ మిచ్చి
వరుసతోడ నెల్లవారల వీడ్కొల్పి
యంతిపురము సొచ్చె నవనివిభుఁడు. 26

క. అన్నెలఁతలతో రతిసం
పన్నుండై వరుసతోడ భావజుకేళిం
గొన్నిదినంబులు సలుపుచు
నున్నంతం ఖిన్నయాలి కొకనెల మసలెన్. 27

ఉ. చెక్కులు వెల్లఁబాఱె[1] గడుఁ జిట్టుము లయ్యె మొగంబు వాడెఁ జ
న్ముక్కులు నల్పుగూడె నడుముం దరులుం జాలువారె నారు సొం

  1. పల్కఁబాఱె