పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106 సింహాసన ద్వాత్రింశిక

శాస్త్రవేదిచేనున్న విషంబుకంటె
గొల్లవానిచే నమృతంబు గొనుట మేలు. 10

మ. అని తద్వాక్యము లాదరించి పరమేశారాధనం బావిలో
చనయుం దానును జేయుచుండఁగ సుఖస్వప్నంబులో నాత్రిలో
చనుఁ డేతెంచి భవత్ప్రయాసము విశిష్టం బయ్యె నీసువ్రతం
జనుకూలించె శనిత్రయోదశులఁ జేయం బుత్రలాభం బగున్. 11
 
క. అని శంకరుఁ డానతి యి
చ్చిన నతఁడు శనిత్రయోదశీవ్రత మత్యం
తనియతి జరపుచుఁ బుణ్య
మ్మునఁ గొన్నిదినముల కొక్కపుత్రుని బడసెన్. 12

క. ఆపాపనికిం బుణ్య
వ్యాపారుఁడు దేవదత్తుఁ డనుపే రిడి గౌ
రీపతిపదభక్తుని వి
ద్యాపరిచితుఁ జేయుచును ముదంబునఁ బెంచెన్. 13

చ. క్రమమున బ్రహ్మకర్మములు గైకొనఁజేసి యెదుంగుచో[1] వివా
హముఁ దగఁజేసి కాశికిఁ బ్రయాణము చేకొని పుత్రుఁ బిల్చి కా
లము శుభవృత్తుల బ్రదుకు లాగు విచారము సద్గృహస్థధ
ర్మములను మంత్రతంత్రముల మర్మము లెల్లను జెప్పి వెండియున్. 14

క. పరపీడయుఁ బరనిందయుఁ
బరసతియుం బరధనంబుఁ బరులుం గలచోఁ
దిరుగకు పరోపకారము
పొరయంగలచోటఁ బుద్ధిపురికొల్పవనా. 15

  1. యెఱుంగుచో