పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 105



ఉ. ఆతఁడు కీర్తిపూరభరితాఖిలదిగ్విజయుండు సర్వధా
త్రీతలనాథసేవ్యుఁడు సుధీజనపాలనకేలిశీలసం
జాతమనోనురాగుఁ[1] డిల సాహసభూషణుఁ డేలుచుండఁగా
నాతనివీట నొక్కవసుధామరుఁ డుండు విలోచనుం డనన్. 5

వ. ఆవిప్రుం డొకనాఁడు తనపత్ని విలోచన పుత్రలాభము లేమికి వగచి దీనికిం గారణంబేమి నీవు సర్వజ్ఞండ వనియడిగిన నూహించి ధనధాన్యంబు లుద్యోగంబునం బడయవచ్చు విద్యాలాభంబు గురుశుశ్రూషల నచ్చుపడు వంశాభివృద్ధియుం గీర్తియు నీశ్వరకృపం గాక పడయవచ్చునే. 6

క. ఏగురుపురుషులఁ గోరిన
యాగొంతియు ద్రౌపదియు మహాపుణ్యవతుల్
వేగురు బంధులఁ జంపిన
గురుపాండవులు ధన్యు లీశ్వరకరుణయేన్. 7

క. కావున మన మిఁక నెట్టి య
పావనజీవనుల మైనఁ బరమేశ్వరు సం
భావనఁ బుత్రుని బడయం
గావచ్చు నిజోద్యచుంబు గలిగినఁ బడఁతీ. 8

క. అన విని యాసతి వినయం
బెనయం దనయుండు గలుగు నీశ్వరు నారా
ధన మొనరింపుద మనవుడు
దనలో స్త్రీబుద్ధి యనక తా నుత్సుకుఁ డై. 9

తే. పెద్ద యొసఁగెడుమాట యప్రియముకంటెఁ
బడుచుచే నీతివాక్యంబు వడయఁజొప్పు

  1. మనోహరాంగుఁడు