పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 99



ఆ. అట్టిజలధిఁ జేరి యవనీసురుఁడు పలు
మాఱుఁ బిలిచి పిలిచి మదిఁ గలంగి
యుత్తరంబు లేని యుదకంబు నచటికిఁ
బిలువ వచ్చి నేను బేలనైతి. 164

క. సరసత్వము సన్మానముఁ
బొరయనిచోఁ బ్రియము నెఱపఁ బూనుట ధరలోఁ
దెరువాటుకాండ్రకడ ము
ష్కరుఁడై[1] తనకలిమి చూపఁగడఁగుట చుమ్మీ. 165

మ. అని చింతించి పురోహితుండు నిజరాజాజ్ఞవిధి న్వారిధీ
నీను నేఁ బిల్చితి రమ్ము నిల్వనిడికో నీబుద్ధి యంచున్ ఘన
ధ్వనిగాఁ జెప్పి చనంగ నర్ణవుఁడు దివ్యంబైన రూపంబునం
దనరత్నంబులు నాల్గుగొంచుఁ జని పొంత న్నిల్చి యవ్విప్రుతోన్. 166

వ. నీ కింత వేగిరపడనేల నే నిదె వచ్చుచున్నవాఁడ మీరాజునకు మాకునుం బరమసఖ్యం బగు నే మెఱుంగుదుము గావున మమ్ముఁ బిలువం బంపె మే మచ్చటికి వచ్చినవారమ యని ప్రియో క్తి నిట్లనుము. 167

క. కడపటనుండియు నే మ
క్కడ నుండుదు మనుచుఁ జెలిమిగతిఁ దప్పకు మీ
యెడ దవ్వన వలవదు సం
గడ మనఁగాఁ దలఁపులోనఁ గలుగుట చుమ్మీ. 168

క. నెమిలి గిరి నంబుదము గగ
నముపై రవి లక్షయోజనంబులఁ గొలనం
గమలము లక్షద్వయమున
హిమకరుఁ డిలఁ దొగలునుండు నెక్కవె చెలుముల్. 169

  1. నొక్కరుఁడై