పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92 సింహాసన ద్వాత్రింశిక

ఉ. ఇమ్ములఁ గొన్ని యేండ్లు సుఖియింపగఁ దక్కినరాజులెల్లఁ జో
ద్యమ్ముగ నిట్టివార్త విని యచ్యుతుఁ డీతని యల్లుఁ డయ్యె[1]
ర్వమ్ములు మాని వీనిఁ గొలువం దగునంచు భయమ్ముతోఁ దురం
గమ్ములఁ గుంజరమ్ములను గన్యలఁ గప్పము లిచ్చి పంపఁగాన్. 131

క. చేకొనుచు బృహత్సేనుఁడు
చేకొలఁదుల లోఁగు టెఱిఁగి, క్షితిపాలకులం
జీకాకుపఱిచి భూములు
చేకొనఁగా నలఁగి తలఁగి సిగ్గున నొకచోన్[2]. 132

వ. అందఱుం గూడుకొని విచారించుచుం దమలోన. 133

క. సమముగ దేశము లేలుచు
నమరిన మగకూడు గుడిచి యధమాధమభా
వములోఁ బెక్కం డొక్కని
సమరమునకుఁ బోకయునికి[3] చచ్చుట గాదే. 134

క. గణుతింప మానభంగ
వ్రణ మాజన్మంబు నెడ్డ వ్రయ్యలు సేయున్
రణమరణము శూరులకును
క్షణదుఃఖము మీఁద నధికసౌఖ్య మొనర్చున్. 135

ఆ. మానహాని యైన మనత్రోవకంటెను[4]
బ్రాణహీన మైన పదము లేదు
వీనిచేత బాధ వెచ్చుటకంటెను
జక్రధరునిచేతఁ జచ్చుఁ టొప్పు. 136

  1. డీతని కల్లుఁడంచుగర్వ
  2. కైకొనుచు...క్షితిపాలురఁ జీ
    కాకుపడ నడిచి భూములు
    చేకొనఁదలఁచుడు నడచి
  3. జొరకయునికి
  4. అవని మానహాని యగుత్రోవ