పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 91

గిట నాదటఁ జెలగఁగ న
వ్విటుఁడు న్సమరతుల గారవించుచుఁ దివుటన్. 127

సీ. అంగుష్ట మడుగు గుల్ఫాంతంబుఁ జిఱుదొడ
జఘనంబు నాభి వక్షంబుఁ గుచము
భుజమూలములు గళంబును జెక్కుమోవియు
నయనము ల్నుదురు ముందలయు ననఁగఁ
గలుగుచోటులఁ జంద్రకళలఁబెంపునఁ జెక్కు
నారోహణావరోహణము లెఱిఁగి
బీజమంత్రాక్షతవ్యాజదృగ్బాణముల్[1]
హృదయాదిమర్మంబు లెక్కఁజేయు
తే. సుఖముఖాంకనఖరచుంబనభూషణ
గ్రహణతాడనములఁ గదలఁబొడిచి
చిత్తశయనుదెలిపి యుత్తానశాయిత
ముఖ్యసురతతంత్రములఁ గలంచె. 128

క. మనసిజమర్మజ్ఞునితో
మన మలరఁగఁ బెనఁగి కరఁగె మానిని రతిసం
జనితసుఖంబున నెలపొడు
పునఁ గరఁగెడు చంద్రకాంతపుత్రికఁ బోలెన్. 129

శా. ఆజాడం గుచచక్రవాకరుచి పెంపారం దదీయాననాం
భోజాతప్రభ లుల్లసిల్లంగ సముత్ఫుల్లాక్షి[2] మీనద్యుతుల్
రాజిల్లంగ సులోచనాసరసిలో రాయంచభంగిం గళా
భ్రాజిష్ణుం డగు గోళికుండు హరిరూపం బొంది క్రీడించుచున్. 130

  1. హృద్భషల హృదయాదిమర్మవాహికులఁ జొనిపి
  2. పెంపారంగ శుంభన్ముఖాంభోజంబు ల్వికసింపుచుంజెలఁగ నుత్ఫుల్లాక్షి