పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiv


ఔదార్యముగలవారే ఈ సింహాసన మెక్కవలెనని పల్కి ఆ మహారాజు దాతృత్వమును వర్ణించును.

ద్వితీయోపాఖ్యానము - మరల భోజరాజు సింహాసన మెక్కబోగా, రెండవ మెట్టుమీది బొమ్మ భోజుని ఆపి ఒక కథ చెప్పును. చిత్రకూట పర్వతము దగ్గర ఒక బ్రాహ్మణుడు కామితార్థమునకై ఎన్నో యేండ్లు హోమము చేయుచున్నను సిద్ధి కలుగనందున, విక్రమార్కుడు వెళ్ళి తన తల ఆహుతి ఈబోగా, దేవత ప్రత్యక్షమై రాజుకోరిక మేరకు బ్రాహ్మణుని కామితము దీర్చును.

తృతీయోపాఖ్యానము - మూడవ సాలభంజిక విక్రమార్కునకు అశ్వమేధ యాగ సందర్భములో సముద్రుడు పంపిన నాలుగు దివ్యరత్నములను ఒక బ్రాహ్మణునకు దానము చేసిన కథ చెప్పును.

చతుర్డోపాఖ్యానము- నాలుగవ బోమ్మ విక్రమార్కునకు ఒక విప్రుడు కొద్దిపాటి సహాయముచేసి బహుమతి పొందియు, అతని కృతజ్ఞతను పరీక్షింప గోరి. రాజపుత్రుని దాచి చంపినట్లు నటించినను. రాజతనిని క్షమించిన కథ చెప్పును.

పంచమోపాఖ్యానము అయిదవ టొమ్మ విక్రమార్కుడు విదేశీయునిచే 10 అమూల్య రత్నములను కోని. వాటిని తెచ్చుటకై ఒక భృత్యుని పంపును. వాడు గడువులోగా తీసికొని వచ్చుచు దారిలో నదిదాటించిన పడవవానికి 6 రత్నము లిచ్చినట్లు చెప్పగా మిగిలిన 5 రత్నములను గూడ భృత్యున కిచ్చిన కథ చెప్పును.

షష్ణోపాఖ్యానము. ఆరవ బొమ్మ విక్రమార్కు డొకనాడు భార్యలతో క్రీడావనమున విహరించుచుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి జగదంబ నన్ను గృహస్థుడవు కమ్మని నిన్ను ఆశ్రయింపుమని చెప్పగా వచ్చితిననును.