పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 77

సీ. అనుచుఁ గడంకతో నా భోజతిలకుండు
దివ్యాసనంబెక్కఁ దివిరి మఱియు
ఫలకుసుమాదిశుభద్రవ్యములు గూర్చి
సర్వపూజలుఁ దొంటిజాడఁ జేసి
కవిరాజభూసుర గాయకపాఠక
నర్తకులును దనకీర్తి పొగడఁ
బసిఁడిగిన్నియలు చేపట్టి పుణ్యస్త్రీలు
శిరమున మౌక్తికశేష లిడఁగ
ఆ. ఖడ్గహస్తుఁ డగుచుఁ గదలి నృపాసన
ప్రాంతభూమి చేరె గ్రహబలంబు
గలుగు వేళఁ బూర్ణఘటికాంతనాదంబు
చెవుల సోఁకినంత శీఘ్రగతిని. 60

క. శింజాయితమంజీర
వ్యంజితనీలాంశుభృంగ మగు పదకంజం
బంజక యిడఁగా వేళా
భంజిక[1] యై యచట సాలభంజిక పలికెన్. 61

క. ఓహూ భూవర వలవని
హాహూలివి[2] యేల విక్రమార్కునిసరిగా
సాహసమును గంభీరో
త్సాహంబును లేక యెక్కఁ దరమే నీకున్. 62

ఆ. అనుడు నిలిచి భోజుఁ డాత్మగుణంబులు
చెప్పఁ జూచి మొదలితప్పు దలఁచి

  1. భంజని
  2. వలదుసుమాహూలివి. యాహూలివి- చిన్నయసూరి