పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 సింహాసన ద్వాత్రింశిక

చినఁ బలికించిన నవ్విం
చిన మెచ్చినను నిట్ల చెప్పక యిమ్మా[1]. 53

చ. అని సెలవిచ్చిన ధనగృహస్థితుఁ డౌ తనలెంక యిట్టిచొ
ప్పున నొసఁగంగ యాచకులు భూజనకల్పమహీజ మంచు నిం
పునఁ బొగడంగ దానగుణభూషణుఁ డంచు నవంతినాయకుం
డనుదినము యశంబు దిశలం దలర న్మహి యేలె నెంతయున్. 54

క. అది కారణముగ నతనికి
సదృశం బగుగుణము నీకుఁ జాలదుఁ భువిలో
బొదలని పెద్దఱికంబులు
పొద పెట్టక[2] మగిడి పొమ్ము భోజనృపాలా. 55

వ. అనుడు ననంతరంబ. 56

శా. లగ్నం బీక్రియ విఘ్న మొందిన నిరాలాపంబుగా విస్మయో
ద్విగ్నస్వాంతనృపాలపౌరహితవందివ్రాత మీక్షింపఁగా
భగ్నోత్సాహమనోరథుం డగుచు భూపాలుండు లజ్జాభరా
భుగ్నోస్యాంబుజుఁ డౌచు నింటి కరిగెం బుణ్యం బగణ్యంబుగన్. 57

వ. అంతఁ గొంతకాలంబున. 58

రెండవ బొమ్మ కథ

క. మొలఁ బులితోలును మేనం
బలుచని వెలిపూఁత యఱుతఁ బాములపేరుం
దల మిన్నేఱును జడలను
జలివెలుఁగుం గలుగు మేటిజంగముఁ గొలుతున్. 59

  1. చినఁ బలికించిన మెచ్చించిన నిట్లని నీవు నాకుఁ జెప్పకయిమ్మా
  2. పొదవెట్టక-శర