పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 సింహాసన ద్వాత్రింశిక



జంభారీపరికీర్తితాంభోజినీమిత్ర[1]
సూణుసమాహియదాణరాయ[2]
అక్కిణహృదయ దండొక్కకేళఃక్కేళి
పతివఃకణీవళఃపక్కడక్క
అంకక్కరిక్క మహాలదసాందన
లవలవప్పహిత తులఃకధీర
ఆ. ధీరసంపదస్తు దేవబంధకహిమ[3]
దఃకసొక్కు మోరిదర్శనిచయ
యనుచు నాల్గుభాషలను రాజు దీవించి
నయనసంజ్ఞ నాసనమున నుండి. 46

సీ. రాజేంద్ర యాఱక్షరముల పేరిటివాఁడ
నాద్యక్షరము మాన నశ్వవేది
రెండక్షరములఁ బరిత్యజించిన నాట్య
కర్త మూఁ డుడిపిన గతవిదుండ
నాలుగు నుడిగింపఁ జాలనేర్పరి నైదు
విడిచిన బుధుఁడ నీవిధము గాక
సర్వాక్షరంబులుఁ జదివిచూచిన బుద్ధి
బలముగాఁగల యట్టి ప్రౌఢుఁ డనఁగ
ఆ. నేతిబీఱకాయనీతి గాకుండంగ
నిన్ని విద్యలందు నెన్నఁబడ్డ
సార్థనాముఁ డైనయర్థిగా నెఱుఁగుము
విబుధపంకజార్క విక్రమార్క. 47

  1. యంభోఝణీమిత్ర
  2. ఈ పద్యములోని ప్రాకృతశబ్దములు తెలియుట లేదు. ఇందు చతుర్విధ ప్రాకృత భేదములున్నట్లు చెప్పఁబడినది.
  3. దేవబంధకహోదు