పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 73



దేఁకువసెడి తొల్లిటివ్రత
మాకౌలఁదినె నిత్యసత్ర[1] మచ్చట జరిపెన్. 40

ఉ. కావున నేన దాత నని గర్వము గైకొని పల్కి నీ వస
ద్భావుఁడ వైతి దానమును బౌరుషముం బరు లెన్నకుండఁగాఁ
దా వినిపించెనేనియు నతండుఁ దృణంబును నొక్కయెత్తగున్
క్ష్మావర గంజిలో మెతుకు గల్గినఁ గ్రొవ్వుట నీమహత్త్వముల్. 41

ఆ. అనుడు ఘనుఁడు భోజుఁడును మనంబున స్రుక్కి
బమ్మరిల్లి పసిఁడిబొమ్మ ! నాదు
దానమల్ప మన్నదానవు మీరాజు
దానమెంత చెప్పు దాన నిలుతు[2]. 42

వ. అనిన సాలభంజిక యి ట్లనియె నతం డిట్టి మహావదాన్యుండు. 43

క. పొడగన్నంతనె వేయును
నొడివినఁ బదివేలు నగిన నూఱ్వేలు మనం
బొడఁబడి మెచ్చినఁ గోటియు
నడిగెడువారలకు నిచ్చు హాటకమయముల్. 44

చతురంగ తజ్ఞుని కథ


మ. అది యెట్లన్న నతండు కీర్తి దిశలన్ వ్యాపింప భూమండలం
బుదధు ల్మేరగ నేలుచుండి యొక నాఁ డుర్వీశులు న్మంత్రులున్
సుదతీరత్నములు రసజ్ఞులుఁ గవిస్తోమంబులుం గొల్వ న
త్యుదయశ్రీఁ గొలువిచ్చి యుండఁగఁ గవీంద్రుం డొక్కఁ డేతెంచుచున్. 45

సీ. దందశూకాధిపోద్దండభుజాదండ
భూరివిశ్వంభరాభారధుర్య

  1. మాకొలఁదినె నిత్యసత్ర మచ్చట—చిన్నయసూరిగారి పాఠము.
    మాకలసత్రంబుభంగినచ్చట—ఇతర ప్రతులలో.
  2. దాన మెంత నీవు దానిఁ దెలుపు. చి. సూరిగారు, దానమెంతనేర్పు—