పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
60
సింహాసన ద్వాత్రింశికఉ. నందనృపాలుఁ డిట్లను మనంబునఁ గ్రుళ్ళుచు నెల్లవేల్పులున్
మందులు మ్రాఁకులు న్మణులు మంత్రములున్ వృథయయ్య శారదా
నందుఁడ యిప్పుడున్నఁ బ్రియనందనుఁ దెల్పఁగ నోపు నట్టి పె
ద్దం దునిమించినాఁడ వలదా హితు లెవ్వరు నడ్డపెట్టఁగన్. 293

ఉ. నావుడు మంత్రి చిత్తమున నవ్వుచు నావిధ మయ్యె నాఁడు, నేఁ
డీవిధ మయ్యెఁ, బేరుకొననేటికి నిందఱపాల దృష్టమౌ
దైవము గల్లెనేని భువిఁ దత్సముఁ డొక్కఁడు గల్గనేరఁడే
కావున బమ్మరింపఁ బని గా దని యూఱడఁ బల్కె భూపతిన్. 294

ఉ. ఆవిభు నూఱడించి నిలయంబున కేగి బిలంబు విప్రుతో
నీవిధ మెల్లఁ జెప్పిన మహీసురుఁడు ‘న్సచివాగ్రణీ భవ
ద్బూవరుఁ జేరి నాఁటిగురుపుత్రిక యేడవయేఁటి పాప నీ
జీవము చిక్కుదీర్చు నని[1] చెప్పుము నీ’ వని పంచె నాతనిన్. 295

వ. అటకుం జని. 296

ఉ. ఆతఁడు విన్నవించినఁ బ్రియాన్వితుఁడై సుతుఁ దోడుకొంచు ధా
త్రీతలనాథుఁ డింటి కరుదెంచుడు నాధరణీసురుండు క
న్యాతిలకంబు నాజవనికాంతరికాకృతి నిల్పి పద్యవి
ద్యోతితరీతి దోఁప వినుచుండెఁ గుమారు ‘ససేమిరా’ ధ్వనిన్. 297

వ. ఇట్టి నాలుగక్షరంబుల నాలించి విని ‘యందఱు నూరకుండుం’ డని కుమారు నుద్దేశించి పద్య మి ట్లని చదివె. 298

క. “స”జ్జనభావము గలుగు సు
హృజ్జనముల మోసపుచ్చు టిది నేరుపె నీ
యజ్జతొడమీఁదఁగూర్కిన
యజ్జంతువుఁ జంపఁజూచు టది పౌరుషమే. 299

  1. జీవము వేదదీర్చునని