పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

59

క. ఆయెలుఁ గతనిఁ బిలిచి య
న్యాయివి పరలోకపీడనం[1] బగుదురితం
బీయెడన పాయఁ జేసెద
రాయిట వినుమిఁక “ససేమిరా" యను మెపుడున్. 289

క. ఈ నాలు గక్షరంబుల
నీనేరమి నొరుఁడు చెప్పేనేని వికారం
బూనక తొల్లిటిక్రియ స
న్మానము గైకొనుము మంచిమాటలతోడన్. 290

క. అని వీడ్కొలిపినతఱి న
ట్లనె యాతఁడును 'న్ససేమిరా' యనుచు వనం
బున భూతావిష్టుని చా
డ్పునఁ దిరుగఁగ వానిహయము పురిఁ జేరుటయున్. 291

సీ. అశ్వరత్నం బొంటి నరుదెంచె నిన్నఁటి
శకునము ల్పాపనిఁ జంపె నొక్కొ
యని తలంచుచు నందజనపాలుఁ డాజాడఁ
బఱతెంచి యడవిలో బాలుఁ జూచి
యన్న యిదేమి రా నన్న “ససేమిరా"
యనుడుఁ గలఁగి యొత్తి యడుగుటయును
నాలుగక్షరముల నోలిఁబల్కెడువాని
దోడ్కొనిపోయి మందుల నొనర్చి
ఆ. వీనిభూతశంక విడిపించువారికి
నర్ధరాజ్య మిత్తు ననుచుఁ జాటి
వేలుపులకుఁ బెట్టి వేఁడికొన్నను నాలు
గక్షరములు విడువఁడయ్యె వాఁడు. 292

  1. యన్యాయపరత జేయు పీడనం