పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

యందుగల కథల వరుస యిందు వానరాదు. విషయములును భేదముగా ఉన్నవి" అని చెప్పిరి.

కాని శ్రీ శాస్త్రి /గారు కథా సరిత్సాగరమును గాని, సంస్కృత విక్రమార్క చరిత్రమును గాని సరిగా పరిశీలింపలేదు. సింహాసన ద్వాత్రింశికతో పోల్చిచూడలేదు. కథా సరిత్సాగరమున విక్రమార్కుని కథలు, బేతాళ పంచవింశతి కథలు ఉన్నవి. కాని గోపరాజు వానిని గ్రహింపలేదు. ఆ కథలకును తెలుగు కావ్యమునందలి కథలకును పోలికలే లేవు. అవి భిన్నముగా ఉన్నవి.

గద్యపద్యాత్మకమైన ఒక సంస్కృత విక్రమార్క చరిత్రమును వావిళ్ళవారు. 1936లో ప్రకటించిరి. అదియే గోపరాజు అనువదించిన మూలగ్రంథము. ఆ సంస్కృత మూలమును పూర్తిగా గ్రహించి గోపరాజు మఱి కొన్ని కథలను సమకాలిక జనజీవన విశేషములను చేర్చి “సింహాసన ద్వాత్రింశిక" అనుపేర ఈ కథాకావ్యమును రచించెను.

కీ.శే. మల్లంపల్లి సోమశేఖర శర్మగారు గోపరాజు అనువదించిన మూలమేదో తెలియదనిరి'. డా|| నేలటూరి వేంకటరమణయ్య గారు 'దీని మాతృక యెద్దియో తెలియదు. ఆ సంస్కృత మూలము కాకతీయ యుగమున క్రీ. శ. 1200-1323ల మధ్య రచింపబడి యుండును[1] అని చెప్పిరి[2], అందుకు ఆధారాలు చూపలేదు, కేవలము వారి ఊహయే ఆధారము.

పాల్కురికి సోమనాథుని శిష్యుడు ఏకామ్రనాథుడు (1330 ప్రాంతము) "సింహాసన ద్వాత్రింశిక" అను వచన గ్రంథమును వ్రాసినట్లును, అదే పేరుతో ఒక ద్విపద రచన గూడ ఉన్నట్లును శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారు వ్రాసినారు[3] . గోపరాజు సంస్కృత మూలమును ఈ

  1. History of the Reddy Kingdoms.
  2. వాఙ్మయవ్యాసమంజరి.
  3. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక 56 సంపుటి, 6 సంచిక.