పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 సింహాసన ద్వాత్రింశికక. తలఁగిన వానికి నది తన
తలరత్నం బిచ్చి పుచ్చి తా నేగిన ని
మ్ముల వాఁడు నేగి పురిలో
పల నొక వర్తకున కమ్మె పదిగద్దెలకున్. 261

చ. అట మఱునాఁడు వచ్చిన మహాభుజగేంద్రుఁడు గారవించి ని
న్నఁటిమణి యెంత కమ్మితి వనా యన మూల్య మెఱుంగఁ దెల్ప న
క్కట[1] పదివేల కమ్మక వికల్పము చేసితి వింతనుండి మి
క్కుటముగ నమ్ముకొమ్మనుచుఁ గ్రొత్త ఫణామణి యిచ్చే వానికిన్. 262

క. తనయిల్లుఁ గాచినాఁడని
మనమునఁ బ్రియమంది యిచ్చు మణు లనుదినముం
గొనిపోయి యమ్ముకొనుచును
ధనికుండై వాఁడు చెల్మి దప్పినబుద్ధిన్. 263

ఆ. దీని కెచటఁ గలుగు దివ్యరత్నంబులు
దీని మొదలితావుఁ దెలియవలయు
ననుచుఁ గోరిపోయి యాపాముచనుజాడ
వట్టి యేగి యొక్క పుట్టఁ గనియె. 264

క. కని తిరిగి పోయి మఱునాఁ
డనలంబును గసవుమోపు హస్తంబులఁ గై
కొనివచ్చి తొఱ్ఱలోపల
జొనిపి భుజంగంబు మిడుకుచు న్మడియంగన్. 265

క. జాల్ముం డిటు గాలిచి
వల్మీకముఁ ద్రవ్వఁ జనిన వడి విషములచే

  1. వనాయని మూల్యము నెట్టెఱింగి యక్కటఁ