పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 53నిద్ర సుఖ మెఱుఁగ దనఁగా
నిద్రించెఁ దదంకశయ్య నృపసుతుఁ డంతన్. 257

సీ. శార్దూల మటు చూచి నిర్దయత్వముతోడ
భల్లూక! పగపట్టి బ్రదుకఁగలవె
వాఁడు నీ కేలెస్సవాఁడయ్యెఁ బరజాతి
నృపతిపుత్రుండు నిష్కృపుఁడు వీడు
మనకులం బాదిగా వనగోచరంబుల
వేఁటచాటున నొక్క నూటిఁ జంపె
నిల నొక్కగూఁటిపిల్లల మిద్దఱము దుష్ట
బాలునకై పోరనేల మనము
ఆ. వీనిఁ గ్రింద వైవు విడిచిపెట్టెద నిన్ను
సగము నీకు నిత్తు నగవు గాదు
నరుని నమ్మవలదు నమ్మి మున్నొకపాము
చిచ్చులోనఁ గాలి చచ్చెఁ గాదె. 258

క. ఆ కథ విను వింధ్యాటవి
నేకలుఁ డనుజోయ తోఁటయీరమున మహా
శాకోటముఁ[1] దెగనఱకఁగ
నాకోటరసీమ నొక్కయహిపతి వెడలెన్. 259

ఆ. వెడలి యేను నిలిచి విహరించు తా విది
వలచు దీన నేమి గలదు నీకు
నన్నుఁ గలసి బ్రతుకు[2] మెన్నఁడుఁ జేటులే
దనిన వెరఁగుపడుచు నట్ల తలఁగె. 260

  1. తొంటియిర వెఱిఁగి మహానోకహముం
  2. ఇదిగొ గొమ్ము మణియు నెన్నఁడు