పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

x

వివరించుటను బట్టి తెలిసికొన వచ్చును. ప్రాసంగికముగ స్త్రీజాతులు, కుశనములు, చేపల జాతులు, అశ్వజాతులు, వృక్షజాతులు, వస్త్ర విశేషములు , ఆభరణవిశేషములు, రాజనీతి, ఆంధ్రచ్చందో విశేషములు, ఛందోభేదములు , యోగశాస్త్రవిషయములు, మల్లయుద్ధ పద్దతులు, సర్పజాతులు, స్వప్న శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, గణకరీతులు, 64 కళలు, ద్యూతక్రీడా విశేషములు, వేట పద్దతులు మొదలయిన విషయములను తెలిపెను, వీనిలో కొన్ని మూలములో సూత్రప్రాయముగ ఉన్నవి. ఈ అన్నిటిలో గోపరాజునకు మంచి ప్రవేశమున్నట్లు తెలియుచున్నది

ఇతడు చతుర్విధ కవితా విశారదుడు, తనకుగల బంధకవితా చాతుర్యమును రెండు చోట్ల ప్రదర్శించెను. సంస్కృత పద ప్రయోగ నైపుణ్య మెంత కలదో అచ్చ తెలుగులలో గూడ అంతే నైపుణ్యమున్నట్లు నిరూపించు కొన్నాడు.

సంస్కృత మూలము- 'సింహాసన ద్వాత్రింశిక'స్వతంత్ర కావ్యము కాదు. ఇది సంస్కృత గ్రంథమునకు తెలుగుసేత అని కవియే చెప్పినాడు.

"ఈ సరసోక్తి కావ్యమొకఁ డిమ్ముల సంస్కృత భాషనచ్చుగాఁ
 జేసిన నట్ల వీఁడు మఱి చేయుట యేటిది యంచుఁ జెప్పఁగా
 జేసి యనాదరం బురక చేయకుఁడీ విలుకాఁడు తూఁటుగా
 నేసిన నందే పాఱ మఱి యేసినవానిద సూటిగావున౯.” (1-35)

ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి ప్రథమ ముద్రణమును పరిష్కరించి పీఠిక వ్రాసిన శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు “దీనికి మూలము కథా .సరిత్సాగరము. ఆ సాగరము నుండి ఈ రత్నము నెత్తి చక్కగా సానబట్టి ఆంధ్ర సరస్వతికిఁ బూజ యొనర్చిన మహాకవి గోపరాజు అని వ్రాసినారు. అదే సుదర్భమున అధస్సూచికలో “అచ్చు పడిన సంస్కృత . మూలమొక్కటి విక్రమార్క చరిత్రము (గద్యపద్యాత్మికము) కలదు. కాని