పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. వనితలకు నురము నోరును
దను వర్ధము నిచ్చి రచ్యుత బ్రహ్మ శివుల్
ఘనుఁడా మువ్వుర మీఱుచు
జనపతి దన సతికి నిచ్చె సర్వాంగములన్. 206

సీ. అవనీశుఁ డీక్రియ నంతఃపురంబున
విహరించుచును మంత్రివిన్నపమున
బలిమిమై నొకనాఁడు కొలువున కేతెంచి
యా సతి తొడమీద నభిముఖముగ
నిడుకొని తన్ముఖం బీక్షించుచుండఁగా
దొరలును భటులును బరులు హితులు
లజ్జాభయములఁ దల ల్వంచికొని యుండ
గొంత తడవున కయ్యింతి చెయ్యి
ఆ.వె. పూని పట్టుకొనుచు లోనికిఁ బోయిన
మంత్రి కలఁగి యిట్టి మమత నేఁడు
మానిపింపకున్న హాని యౌనంచు మో
మోట మాని తోడ నొయ్యనేగి. 207

ఆ.వె. దేవ! యిచట నెట్టి తెఱఁగైన నొప్పు నీ
యతివ నటకుఁ దెచ్చు టనుచితంబు
అనుడు నృపుఁడు నవ్వి యచ్చటి కే వచ్చి
యున్న నేమి రాకయున్న నేమి? 208

క. విశ్రుత నీతి వివేక బ
హుశ్రుత నీయట్టి మంత్రి[1] యుండఁగఁ బ్రమదో

  1. సచివుఁ డుండఁగ