పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix


'అష్ట భాషా విదుడ' నుటలో గొంత సత్యము లేకపోలేదు. సంస్కృతము, షట్‌ప్రాకృతములు తెలుగు కలిసి అష్టభాషలగును. సంస్కృతాంధ్రములలో చక్కని పాండిత్యము గలవాడనుటలో సందేహము లేదు. నాలుగవ ఆశ్వాసములోని ముక్తపదగ్రస్త నిరోష్ఠ్య దండకము, ఆశ్వాసాంతపద్యాలు అతని సంస్కృత పాండిత్యమును చాటుచున్నవి.

ప్రాకృత భాషాజ్ఞానము గలవాడనుటకు అతడొక పద్యములో ప్రాకృత భాషా పదములను వాడినాడు.

“దందశూకాధిపోద్దండ భుజాదండ
      భూరి విశ్వంభరాభారధుర్య
 జంభారి పరికీర్తితాంభోజినీ మిత్ర
      సూణు సమాహియదాణరాయ
 అక్కిణ హృదయదండొక్క కేశఃక్కేళి
      పతివఃకణీవళఃపక్క డక్క
 అంకక్కరిక్క మహాలద సాందన
      లవలవప్పహిత తులఃకధీర

 ధీరసంపదుస్తు దేవబంధకహిమ
 దఃకసొక్కుమోరి దర్శనిచయ
 యనుచు నాల్గుభాషలను రాజు దీవించి
 నయన సంజ్ఞ నాసనమున నుండి". (2-41)

ఇందు నాల్గు భాషలనుట చతుర్విధ ప్రాకృతములనుటకు కావచ్చును . తన ప్రాకృత భాషా పరిచయము నిట్లు తెలిపినాడు. ఈ ప్రాకృత భాషా వాక్యముల కర్థమేమో ఆ భాషావేత్తలు చెప్పవలెను.

గోపరాజునకు సాహిత్య వ్యాకరణములేకాక అనేక శాస్త్రములలో తగిన పరిజ్ఞానమున్నట్లు కావ్యము నందక్కడక్కడ బహు విషయములను