ఈ పుట ఆమోదించబడ్డది
vi
మూడు సంపుటాలను ఒకే బృహత్ సంపుటముగా రూపకల్పన చేసి, ఆధునిక సాంకేతిక సహకారంతో ముద్రించి, మీ ముందుకు తీసుకువచ్చాం.
‘సాక్షి’ వ్యాసాలలో సునిశిత విమర్శకు లోనైన, వ్యంగ్యభరితమైన, అవహేళనకు గురయిన అంశాలన్నీ ఈనాటికీ చర్చనీయాంశములు కావడం విశేషం. ఈ తరం యువపాఠకులకు సైతం ఈ వ్యాసరచనలు స్ఫూర్తిమంతములు కాగలవని మా దృఢవిశ్వాసం.
మా ఈ మూడవ ముద్రణ బృహత్ సంపుటానికి కోరినంతనే ‘యువపాఠకులకు....’ సహృదయతతో రాసిన సన్మిత్రులు, సుప్రసిద్ధ పాత్రికేయులు డా॥ నండూరి రామమోహనరావు గారికి కృతజ్ఞతలు.
మేము సర్వాంగసుందరంగా అందిస్తున్న ఈ నూతన ముద్రణ ‘సాక్షి’ సంపుటమును మా ప్రియతమ పాఠకులు సమాదరించాలని ఆకాంక్షిస్తున్నాం.
శ్రీ వ్యయనామ ఉగాది
30-3-2006
డైరక్టర్ ఆఫ్ పబ్లిషింగ్
అభినందన పబ్లిషర్స్
బి. బాబ్జీ.
డైరెక్టర్