Jump to content

పుట:సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. నాటక ప్రదర్శనము

నాటకాల్లో పాటల్ని పెట్టడం విషయంలో జంఘాలశాస్త్రికి కంపరం ఎక్కువ. ఆ భావాన్ని అతను ఎక్కడా దాచుకోడు సరికదా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆ పాటలలో విరుపులవల్ల సాగతీతలవల్ల వచ్చే అనర్ధాలకు అతను మండి పడతాడు. నాటకాలలో రస, భావాలను మంటగ లిపే సంగీతమంటే, జంఘాలశాస్త్రి తనకున్న మంటను బయట పెట్టాడు.'' ప్రజలు—అందునా పామరులు ఈ పాటలనాటకాలపట్ల చూపించే ఆదరణ అభిమానం, వేలం వెర్రి ఎంత అర్ధరహితమైనవో, ఖండించి పాశ్చాత్యగాన నాటకాల ప్రసక్తి తెచ్చి, వాటికీ, వీటికీ తేడా చెప్పాడు. ఒక్క భక్తిరస ప్రధాన నాటకాలలో, సందర్భ శుద్ధినిబట్టి పాట ముఖ్యంగా ఉండాలిగాని, ఇతర రసాలలో మిగిలిన పాత్రలుచేత పాటలు పాడించకూడదు. నాటకరంగంమీద గానానికి ఏ మాత్రం చోటీయకూడదని జంఘాలశాస్త్రి తీర్పు.

జంఘాలశాస్త్రి యి ట్లుపన్యసించెను.

ఈనడుమ నాటక ప్రదర్శనముఁగూర్చి రెండుపన్యాసము లీయఁబడినవి. వానిలో మొదటి యపన్యాసమునఁ బాటల నాటకముల యుప్రాశస్త్యము వెల్లడి చేయఁబడినది. దాసరిభాగవతములవలె, దాదినన్ముకలాపములవలె, గరిటెనాటకములపలె, రచ్చబల్ల గొల్లవేసపు గోలలవలెఁ బాటల నాటకములు పామరరంజకమాత్రములు, నోటనున్నధూమ చ్ఛదపుఁదూటకట్టెలఁ గర్ణాలంకారములుగఁ జేసి, నెత్తినున్న చినుఁగుల గుడ్డల నెగదీంత కప్పుఁ గల శ్రేణీమండలము క్రింద సుఖాసనములుగఁ జేసి భామాకలాపపుఁబందిరి కెదురు గను అక్కలను వరుసలేక, క్రమము లేక, బొట్టనవ్రేళ్లపై, మడమల పై, ముంగాళ్లపై, బిఱ్ఱల పై, నొంటియొంటితొడల పై, మోఁకాలిచిప్పల పైఁ గూలఁబడి తలలెత్తి నోళ్లను దెఱచుట కవకాశమున్నంతపట్టున శక్తివంచనము చేయకుండఁ దెఱచి పందిరిక్రిందఁ బండు క్రోఁతివలేఁ బండ్లి గిలించుచున్న హాస్యకరుని కోరుకుళ్లాయి పై నున్న బడ్జెపంగనామములు ❝పెట్టినవా? కుట్టినవా?❞ యను పూర్వపక్ష సిద్ధాంతములు చేయుచు దీని సిగఁదఱుగను! భామవేసమింకఁ బైటఁబడ దేమిరా? యని భామాకథాకలాపాకర్లనోత్కంఠా కుంఠతను నెల్లడించుచు , నీనడుమ ననాహూతుఁడై యన పేక్షితుఁడై వెట్టివేసముతో వేంచేసిన వేణుగో పాలస్వామినిఁ జూచి "అమ్మ" ముండకొడుక! గంపెఁడుగుడ్డలతో గంగిరెద్దువలె నుంటి విరా! ఓరీ! నీవటరా! పట్టుసాలిదాని కూడుతిన్న బాపనపద్దన్నవా! చాలుచాలు! ఈపాటికి .